ఆరోగ్యాన్ని పెంచడంలో, అనారోగ్యాన్ని అడ్డుకోవడంలో తాజా పండ్లు, కూరగాయలదే ప్రధానపాత్ర. ఆయా కాలాలలో పండే సీజనల్ పండ్లను తరతరాలుగా మనం తింటూనే వస్తున్నాం. ఆరోగ్యాన్ని అందించే పండ్లలో ఆప్రికాట్ కూడా ఒకటి. ఇదొక డ్రైఫ్రూట్. ఇతర డ్రైఫ్రూట్స్ తో పోలిస్తే దీనిలో క్యాలరీస్ తక్కువ. దీన్ని కొంతమంది జల్దారు పండు అని, మరికొందరు ఖుబానీ అని పిలుస్తారు. తీపి, వగరుల కలయికతో ఉండే దీని రుచి కాస్త భిన్నంగా ఉంటుంది. రుచి సంగతి పక్కనపెడితే, ఇదిచ్చే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం అమోఘం. దీనిలోక్యాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, , విటమిన్ ఎ, ఐరన్ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఒక కప్పు ఎండు ఆప్రికాట్ లో 158 మైక్రో గ్రాముల విటమిన్ ఎ ఉంటుంది. శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలను ఆప్రికాట్ అందిస్తుంది.
ఆప్రికాట్ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు – Health Benefits of Apricot in Telugu
1. జీర్ణశక్తిని పెంచుతాయి
ఈ పండులో పీచు పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలోని రెటినాల్ అనే కొవ్వు శరీరంలో తేలికగా కరుగుతుంది. కొవ్వు ఆమ్లాలను వేగంగా విచ్ఛిన్నం చేస్తుంది కాబట్టి మీ జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది, జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. అంతే కాదు, క్రమం తప్పకుండా పేగులను శుభ్రపరచడం ద్వారా జీర్ణశయాంతర సమస్యల నుండి ఈ పండు మిమ్మల్ని రక్షిస్తుంది. మలబద్ధకం, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలను దరి చేరనీయదు.
2. కంటి చూపును మెరుగుపరుస్తాయి
ఆప్రికాట్లు కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. అంధత్వాన్ని త్వరగా రానీయదు. ఈ పండులో కంటిచూపును కాపాడే కెరోటినాయిడ్లు, శాంతోఫిల్స్ పుష్కలంగా ఉన్నాయి. వీటి వల్ల వయసు మీద పడుతున్నందువల్ల వచ్చే దృష్టి సంబంధ సమస్యలు దూరంగా ఉంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం, ఆప్రికాట్ కెర్నల్ రసాన్ని కళ్లకు అప్లై చేయడం వల్ల కన్నీటి
ఉత్పత్తిని ప్రేరేపించవచ్చు. దీని ద్వారా పొడి కళ్ళ సమస్యను తగ్గించవచ్చు. (1).
3. బరువు తగ్గడానికి దోహదపడతాయి
ఆప్రికాట్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకర పద్ధతిలో బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. ఆప్రికాట్లో ఉండే టాన్సైట్లు మెదడు కణాలనుప్రేరేపించి, కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. ఆకలిని నియంత్రిస్తాయి. వీటన్నింటి ఫలితంగా బరువు తగ్గవచ్చు.
4. గుండెకు మంచిది
ఈ పండ్లలో ఉన్న పొటాషియం రక్తపోటు స్థాయులను అదుపులో ఉంచుతుంది. అలాగే అధికంగా ఉండే ఫైబర్ కొవ్వును తగ్గిస్తుంది.
అథెరోస్క్లెరోసిస్ వంటి గుండె సంబంధిత వ్యాధులను, గుండె పోటును నివారిస్తుంది.
5. రక్తహీనతకు చెక్
ఆప్రికాట్లలో అధిక మోతాదులో ఇనుము ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. అలాగే రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది
6. మధుమేహాన్ని నియంత్రిస్తుంది
ఒక ఆప్రికాట్లో కేవలం 17 కేలరీలు, 4 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి.
కనుక మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని తమ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. దీనిలోని ఫైబర్ రక్తంలోని చక్కెర స్థాయులను క్రమబద్ధీకరిస్తాయి. తిన్నవెంటనే అకస్మాత్తుగా రక్త స్థాయిని పెంచవు.
7. చెవినొప్పిని తగ్గిస్తాయి
చెవినొప్పికి ఆప్రికాట్ నూనె ఔషధంలా పనిచేస్తుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. రెండు మూడు చుక్కల ఆప్రికాట్ నూనె నొప్పి నుంచి ఉపశమనం పొందచ్చు.
8. నొప్పి, మంటను నివారిస్తాయి
ఆప్రికాట్ పండు మాత్రమే కాదు, విత్తనాలు కూడా నొప్పి, మంటను నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయని కనుగొన్నారు. విత్తనాల నుంచి తీసిన నూనె శరీరంలో కణితి ఏర్పడటాన్ని, పెద్దపేగులో కలిగే మంట లక్షణాల నుంచి కాపాడుతుంది. దీని వల్ల పేగు వ్యాధులకు దూరంగా ఉండచ్చు (5). ఆర్థరైటిస్ ఫౌండేషన్ యొక్క నివేదిక ప్రకారం, ఆప్రికాట్లలో బీటా-క్రిప్టోక్సంతిన్ అనే రసాయనం అధికంగా ఉంది. ఇది ఆస్టియో ఆర్థరైటిస్, ఆర్థరైటిస్ సమస్య వల్ల కలిగే నొప్పిని నివారించగలదు (6). ఈ పండులోని మెగ్నీషియం కూడా నొప్పిని తగ్గిస్తుంది.
9. రక్తపోటు అదుపులో…
ఈ పండ్లలోని పొటాషియం రక్తపోటు స్థాయులను నియంత్రిస్తుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రించడం గుండెకు కూడా మంచిది.
10. కాలేయాన్ని అండగా…
అధ్యయనాల ప్రకారం, ఆప్రికాట్ కాలేయానికి ఎంతో మేలు చేస్తుంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోయే ఫ్యటీ లివర్ వ్యాధి నుంచి బయటపడేలా చేస్తుంది. కాలేయం ప్రభావవంతంగా పనిచేసేలా చేయడంలో ఆప్రికాట్ ముందుంటుంది(8).
11. గర్భిణీలకు పోషకాహారంగా…
ఆప్రికాట్లలో పోషకాలు అధికం. గర్భిణికి ఎంతో అవసరమయ్యే ఇనుము ఈ పండులో పుష్కలంగా లభిస్తుంది. అయితే గర్భధారణ సమయంలో వైద్యుడితో సంప్రదించాకే ఆప్రికాట్లను తినడం ఉత్తమం.
12. శ్వాస సంబంధిత ఇబ్బందులకు…
ఉబ్బసం (ఆస్తమా), జలుబు, ఫ్లూ లక్షణాలు ఆప్రికాట్ తినడం వల్ల తగ్గుతాయని పరిశోధనలలో తెలిసింది. ఈ పండులో ఉండే విటమిన్ ఇ
యాంటీఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆప్రికాట్లలో బీటా కెరోటిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది జ్వరాన్ని తగ్గిస్తుంది.
ఆప్రికాట్ వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు – Skin Benefits of Apricot in Telugu
ఆప్రికాట్లలోని విటమిన్ సి, ఎ, ఫైటోన్యూట్రియెంట్స్ చర్మానికి చక్కని మెరుపును అందిస్తాయి. ఈ పండులో నిండుగా ఉన్న యాంటీ ఏజింగ్ లక్షణాలు వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదించేలా చేస్తాయి.
1. యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది
ఎలా ఉపయోగించాలి?
ఆప్రికాట్ కెర్నల్స్ నుండి తయారుచేసిన స్క్రబ్ మీ చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగించడానికి సహాయపడుతుంది. కొత్త చర్మ కణాలను పెంపొందిస్తుంది. ఇలా చేయడం వల్ల ముఖంపై గీతలు, చిన్న ముడుతలు కనుమరుగవుతాయి.
ఆప్రికాట్ నూనె చర్మాన్ని మెరిపించడంలో ముందుంటుంది. మీ చర్మాన్ని మృదువుగా చేయడానికి ఇతర పండ్లతో కలిపి దీన్ని ముఖంపై మాస్క్ లాగా వేసుకోవాలి. కాసేపటి తరువాత కడిగేస్తే ముఖం కొొత్త మెరుపును సంతరించుకుంటుంది.
2. చర్మానికి మెరుపు
ఎలా ఉపయోగించాలి
ఆప్రికాట్ స్క్రబ్స్ దెబ్బతిన్న చర్మ కణాలను తొలగించడం ద్వారా మీ స్కిన్ టోన్‌ను మెరుగుపరచడంలో సహాయపడతాయి. చక్కెరతో కలిపిన ఆప్రికాట్ నూనెను మంచి స్క్రబ్ గా ఉపయోగపడుతుంది. ఇది బ్లాక్ హెడ్స్ ను తొలగించి మూసుకుపోయిన చర్మ రంధ్రాలను తెరుస్తుంది.
3. చర్మ సమస్యలకు
ఎలా ఉపయోగించాలి:
విటమిన్ సి , ఎ అధికంగా ఉండటం వల్ల ఆప్రికాట్ ఆయిల్ తామర వంటి చర్మ సమస్యలపై ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉపయోగించే ముందు
వైద్యుడిని సంప్రదించడం మంచిది. అలాగే ఆప్రికాట్ ఆకుల రసంతో వడదెబ్బ, తామర, గజ్జి వంటి వాటి నుంచి ఉపశమనం పొందచ్చు. మొటిమలను పోగొట్టడంలో ఆప్రికాట్ గుజ్జు ప్రయోజనకరంగా ఉంటుంది.
ఆప్రికాట్ వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు – Hair Benefits of Apricot in Telugu
- జుట్టు పెరుగుదలకు
ఆప్రికాట్ నూనెలోని విటమిన్ ఇ జుట్టు రాలడాన్ని నివారించి, ఆరోగ్యంగా ఎదిగేందుకు తోడ్పడుతుంది. ఈ విటమిన్, కొవ్వు ఆమ్లాలతో కలిసి ఫ్రీ రాడికల్స్ ద్వారా జుట్టు సంరక్షణకు ఉపయోగపడుతుంది.
- మాడు సమస్యలకు
ఆప్రికాట్ నూనెలో విటమిన్ ఎ, ఇ ఉన్నాయి. పొడి చర్మం, సోరియాసిస్, చుండ్రు, తామర వంటి సమస్యలకు ఈ నూనె మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. నిర్జీవంగా ఉన్న పొడి చర్మానికి కొత్త జీవాన్ని అందిస్తుంది.
ఆప్రికాట్ (జల్దారుపండు) లోని పోషక విలువ – Apricot Nutritional Value in Telugu
ఆప్రికాట్లు (ప్రూనస్ అర్మేనియాకా), తాజావి. | ||
---|---|---|
100 గ్రాములలో పోషక విలువ. మొత్తం- ORAC umol TE / 100 గ్రా.-1115. | ||
(మూలం: యుఎస్‌డిఎ నేషనల్ న్యూట్రియంట్ డేటా బేస్) | ||
అంశం | పోషక విలువ | RDA శాతం |
శక్తి | 50 కెలోరీలు | 2.5% |
పిండిపదార్థాలు | 11 గ్రా. | 8.5% |
ప్రోటీన్లు | 1.4 గ్రా. | 2.5% |
మొత్తం కొవ్వు | 0.4 గ్రా. | 1% |
కొలెస్ట్రాల్ | 0 మి.గ్రా. | 0% |
పీచు పదార్థం | 2 గ్రా. | 5% |
VITAMINS | ||
ఫోలేట్లు | 9 µg | 2% |
నియాసిన్ | 0.600 మి.గ్రా. | 4% |
పాంథోటేనిక్ ఆమ్లం | 0.240 మి.గ్రా. | 5% |
పైరిడాక్సిన్ | 0.054 మి.గ్రా. | 5% |
రిబోఫ్లేవిన్ | 0.040 మి.గ్రా. | 3% |
థయామిన్ | 0.030 మి.గ్రా. | 2.5% |
విటమిన్ ఎ | 1926 IU | 64% |
విటమిన్ సి | 10 మి.గ్రా. | 16% |
విటమిన్ ఇ | 0 మి.గ్రా. | 0% |
విటమిన్ కె | 3.3 µg | 3% |
ELECTROLYTES | ||
సోడియం | 1 మి.గ్రా. | 0% |
పొటాషియం | 259 మి.గ్రా. | 5.5% |
ఖనిజములు(మినరల్స్) | ||
కాల్షియం | 13 మి.గ్రా. | 1.3% |
రాగి | ||
ఐరన్ | 0.39 మి.గ్రా. | 5% |
మెగ్నీషియం | 10 మి.గ్రా. | 2.5% |
మాంగనీస్ | 0.077 మి.గ్రా. | 3% |
భాస్వరం | 23 మి.గ్రా. | 3% |
జింక్ | 0.2 మి.గ్రా. | 2% |
PHYTO-NUTRIENTS | ||
కెరోటిన్-a | 19 µg | — |
కెరోటిన్–ß | 1094 µg | — |
క్రిప్టో–జంతిన్-ß | 104 µg | — |
ల్యూటీన్-జిజంతిన్ | 89 µg | — |
ఆప్రికాట్ ను మీ డైట్లో ఎలా చేర్చుకోవాలి? – How to Add Apricot to Your Diet in Telugu
ఆప్రికాట్ పండును పలు రకాలుగా మీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు.
ఆప్రికాట్ పండును చిన్న ముక్కలు చేసి పెరుగులో కలిపి తింటే బాగుంటుంది. అలాగే ఓట్ మీల్ కు జతగా తిన్నా మంచిదే. సలాడ్ రుచిని పెంచేందుకు ఈ పండు ముక్కలను కలిపి తినాలి. సాయంత్రం పూట ఆప్రికాట్ రసాన్ని తాగితే మరింత ఆరోగ్యం. ఆప్రికాట్ ఆకులను ఫెటా ఛీజ్, బాదం పప్పుతో కలిపి తింటే మంచి రుచిగా ఉంటాయి.
ఆప్రికాట్ (జల్దారుపండు) యొక్క దుష్ప్రభావాలు – Side Effects of Apricot in Telugu
ఆప్రికాట్ గింజలలో అమిగ్డాలిన్ అనే మిశ్రమ పదార్థం ఉంటుంది. దీనినే విటమిన్ బి17 అని కూడా అంటారు. ఇది శరీరంలోకి చేరాక సైనైడ్ గా మారుతుంది. అందుకే గింజల విషయంలో చాాలా అప్రమత్తత అవసరం. ఎక్కువ మోతాదులో ఆప్రికాట్ గింజలు తింటే ప్రాణానికే ప్రమాదం రావచ్చు. కాబట్టి తినకుండా పడేయడమే మంచిది. కొద్దిమొత్తంలో తిన్నా కొన్ని రకాల ఆరోగ్యసమస్యలు వచ్చే అవకాశం ఉంది.
- తలనొప్పి
- వికారం, వాంతులు, తిమ్మిర్లు
- మైకము
- బలహీనంగా అవ్వడం
- మానసిక ఆందోళన
- మూర్ఛ
- కార్డియాక్ అరెస్ట్
- శ్వాసకోశ సమస్యలు
ముగింపు
ఆప్రికాట్లలో అన్ని పోషకాలు ఉన్నప్పుడు, వాటిని మీ ఆహారంలో ఎందుకు చేర్చకూడదు? ఈ పండు తినడం వల్ల మీలో కలిగిన మంచి మార్పులను, అనుభవాలను మాతో పంచుకోండి. కింది కామెంట్ బాక్సులో మీ అభిప్రాయాలను చెప్పండి.
The post ఆప్రికాట్ తో ఆరోగ్యప్రయోజనాలు – దుష్ప్రభావాలు – Apricot (Khubani) Benefits in Telugu appeared first on STYLECRAZE.
from STYLECRAZE https://ift.tt/2DZVjAD
via IFTTT
No comments:
Post a Comment